శనివారం, 28 నవంబర్ 2026
తెలంగాణ గవాక్షం
బ్రేకింగ్
తెలంగాణలో తాజా వార్తలు, ముఖ్యమైన పరిణామాలు...
తెలంగాణవరంగల్

నర్సంపేట మున్సిపల్ నూతన కమిషనర్‌గా కంచర్ల నరేష్ రెడ్డి

షేర్ చేయండి:FacebookTelegramX (Twitter)
నర్సంపేట మున్సిపల్ నూతన కమిషనర్‌గా కంచర్ల నరేష్ రెడ్డి

నూతన కమిషనర్‌కు ఘన స్వాగతం పలికిన చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్.

గవాక్షం నర్సంపేట ప్రతినిధి : నర్సంపేట మున్సిపల్ నూతన కమిషనర్‌గా కంచర్ల నరేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా నూతన కమిషనర్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ.. నూతన కమిషనర్ కంచర్ల నరేష్ రెడ్డి నాయకత్వంలో నర్సంపేట పట్టణ అభివృద్ధి మరింత వేగవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించడంతో పాటు పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారుల సమన్వయంతో పట్టణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పున్నం నరసింహారెడ్డి, సలావుద్దీన్ అయూబ్ ఖాన్, మాదాసి రవి, బీరం భరత్ రెడ్డి, కొత్తకొండ మేఘన, శ్యామ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.